ఎల్ఐసి పాలసీ..ఏడాదికి రూ.56,450 పెన్షన్ పొందొచ్చు

0
91

కరోనా సంక్షోభంతో ప్రజలు స్కీమ్స్ లో డబ్బులు పెట్టడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ మధ్య కాలంలో ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెట్టి అధిక లాభాలు రాబడుతున్నారు. సరల్ పెన్షన్ యోజన చేరితే అధిక రాబడి పొందడం ఖాయం అంటున్నారు ఎల్ఐసి అధికారులు. అంతేకాకుండా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో స్కీమ్ లను పరిచయం చేసింది.

తాజాగా మరో స్కీమ్ పరిచయం చేస్తుంది ఎల్ఐసి. ఇందులో ఒక్కసారే మొత్తం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. 40 ఏళ్ల నుంచే డబ్బులు పొందొచ్చు. అంతేకాకుండా జీవితాంతం పెన్షన్ వస్తుంది. సరల్ పెన్షన్ యోజనలో చేరిన అనంతరం నుండి పెన్షన్ రావడం మొదలవుతుంది. ఒకవేళ  లబ్ధిదారి మరణిస్తే ఇన్వెస్ట్ చేసిన డబ్బులను నామినీకి ఇచ్చేస్తారు.

ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా ఈ పాలసీ తీసుకోచ్చు లేదంటే ఆన్ లైన్ లో అయినా సరేతీసుకోచ్చు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున కూడా తీసుకోచ్చు. నెలకు కనీసం రూ.1000 నుంచి పెన్షన్ వస్తుంది. అంటే నెలకి రూ. 12 వేల కనీస పెన్షన్ వస్తుంది. ఏడాదికి రూ.56,450 పెన్షన్ వస్తుంది. జాయింట్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.55,950 పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో లోన్ కూడా పొందవచ్చు.