Flash: తెలంగాణ ఉద్యమకారుడు కన్నుమూత..సంతాపం వ్యక్తం చేసిన సీఎం

0
93

రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్ రావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెల 31 వ తేదీన హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దేవులపల్లి ప్రభాకర్ రావును చేర్పించారు. కానీ నిన్న ఆరోగ్యం మరింత క్షిణించడంతో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన భారత ప్రభుత్వం తరఫున అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమాలలో సైతం చురుగ్గా పాల్గొనేవాడు. ఈయన మరణ వార్త విన్న సీఎం కేసీఆర్, తెలంగాణ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. అనంతరం కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియజేసారు.