Flash: టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ హత్య వెనుక కారణాలేంటో తెలుసా?

0
74

మహబూబాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ 8 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరకి చంపారు. నిర్మానుషంగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న కౌన్సిలర్‌పై దుండగులు దాడి చేసి పరారయ్యారు. అది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందిన విషయం తెలిసిందే.

దాంతో  ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. దుండగుల కోసం పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని గుర్తించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ ఘటన జరగడానికి ఆర్థిక లావాదేవీల కారణమని ప్రాథమికంగా నిర్థారించామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య కాదని తెలిపారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ర‌వినాయ‌కే స్వ‌యంగా కొంత‌మంది స‌న్నిహితుల‌తో చర్చించినట్లు సమాచారం తెలిసిందన్నారు. కొద్దిరోజులుగా కొంత‌మంది నేత‌ల‌తో బానోతు ర‌వినాయ‌క్ తీవ్రంగా విభేదిస్తూ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన కారణంగా బానోత్ రవి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.