ఏపీలో ఏప్రిల్ 27 నుంచి మే 9 తేదీ వరకు టెన్త్ క్లాస్ ఆన్వల్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో విద్యార్ధులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందించడానికి ఏపీ ఎస్ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు.
పరీక్షలకు వెళ్లే టైమ్ లో మరియు తిరిగి వచ్చే సమయంలో ప్రయాణం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చక్కని వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు బస్సు ఎక్కి కండక్టర్ కు టెన్త్ ఎక్సమ్స్ హాల్ టికెట్ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.