బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసారు. రేపు ఏనిమిదో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఏడు వారాల్లో కంటెస్టెంట్స్ ప్రేక్షకులను నవ్వించడానికి ఎంతో శ్రమించారు. అంతేకాకుండా టాస్కుల్లో గెలవాడిని కూడా అందరు బాగా ప్రయత్నించారు.
కానీ ఎంతబాగా ఆడిన ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ రూల్ కాబట్టి ఈ వారం ఎవరవుతారో అనే దాని మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారం ఓటింగ్ పర్సంటేజీ అజయ్ కి తక్కువ ఉండడంతో ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవారిలో మొదటి స్థానం అజయ్ దేనని బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే గనుక అషురెడ్డి కూడా ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నారు. గత కొద్ది రోజులు ‘బిగ్ బాస్’ అషురెడ్డిని కావాలనే సేవ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అషురెడ్డి సేవ్ అయితే హమీద ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వీకెండ్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌజ్ లోని పరిస్థితుల గురించి ఏం మాట్లాడుతారో అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.