ఏపీలో ఎలక్ట్రిక్ బైక్ కు చార్జింగ్‌ పెడుతుండగా కుటుంబంలో విషాదం..

0
115

ఈ మధ్య చాలామంది ఎలక్ట్రిక్ బైక్ ల కారణంగా మృతి చెందుతున్నారు. మొన్నటికి మొన్నఎలక్ట్రిక్ వాహనం కారణంగా ఓ యువకుడు మృతి చెందడంతో పాటు..ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. పర్యావరణానికి కాపాడాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి పనులు చేసేవారికే దేవుడు అన్యాయం చేస్తున్నాడు. తాజాగా  ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఎలక్ట్రిక్ వాహనం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఉదయం విజయవాడ గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఓ ఫ్యామిలీ బైక్ కు ఛార్జింగ్ పెట్టిన సమయంలో బైక్ పేలడంతో  భర్త మృతి చెందగా..భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. 40 శాతం కాలడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ పోవడంతో భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బైక్ పై మరో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడంతో వారికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి.

.