Flash: వీడు అసలు కన్నా కొడుకేనా..రూ.100 కోసం కన్నతల్లిని హత్య

0
92

ఈ సమాజంలో చాలా మంది ఎవ్వరనేది కూడా చూసుకోకుండా తమ సొంత మనుషులనే చిన్న చిన్న కారణాలకు చంపేస్తున్నారు. తాజాగా ఒడిశా జాశిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హటపాడియా సాహి గ్రామంలో లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగడానికి వంద రూపాయలు ఇవ్వలేదని 22 ఏళ్ల యువకుడు కన్నతల్లినే హత మార్చాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించగడంతో తాగిన మైకంలో యువకుడు తన తల్లిని తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అనంతరం యువకులు అక్కడి నుండి పరారయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.