మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్, ఆమె భర్త స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని నవనీత్ కౌర్ రాణా,తన భర్త ఎమ్మెల్యే రవి గురువారం ప్రకటించడంతో వారు చిక్కుల్లో ఇరుక్కొని నానాతిప్పలు పడుతున్నారు.
ప్రస్తుతం ఈ ప్రకటన ముంబైలో హాట్ టాపిక్ గా మారింది. మతపరమైన భావాలను రెచ్చగొట్టారంటూ శివసేన నేతలు ఆరోపించడంతో శనివారం సాయంత్రం వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు..వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టగా..బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రెండు వారాలు జుడీషియల్ కస్టడీ విధించింది.