అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు ఓ ఘటనతో ప్రజలకు వణుకు పుట్టించారు. ఈ ఘటనలో మావోయిస్టులు రెచ్చిపోయి దుశ్యర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద మావోయిస్టులు తమ క్రూరత్వంతో జనాలకు భయాందోళనకు గురిచేసారు. సమాజాన్ని ఉద్ధరించడానికే తాము పనిచేస్తున్నామని నక్సలైట్లు చెబుతుంటారు. కానీ అది ఎంత వరకు వాస్తవమో ఈ ఘటన చూస్తే అర్ధమవుతుంది.
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును కొందరు మావోయిస్టులు అడ్డగించారు. అనంతరం ఆ బస్సులో ఉన్న అభ్యర్థులను కిందికి దింపి తమ క్రూరత్వంతో బస్సుకు నిప్పుపెట్టారు. ఈ ఘటన వల్ల రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికుల పనులకు భంగం కల్పించి భయభ్రాంతులను చేసారు. దండకారణ్యం బంద్ పిలుపు దృష్ట్యా మావోయిస్టులు ఈ పనికి పాల్పడినట్టు సమాచారం తెలుస్తుంది.