- మహీంద్ర XUV 700
మహీంద్రకు చెందిన మహీంద్రా ఎక్సయూవీ 700 కారులో కూర్చునే అడల్ట్ ప్యాసింజర్స్ 5 స్టార్ రేటింగ్, పిల్లల విషయంలో 4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. క్రాష్ టెస్టులో అన్నింటిలో కలిపి అత్యధిక స్కోర్ పొందిన మోడల్ కూడా ఇదే.. ఇందులో ఫ్రంట్ కొల్లిజన్ వార్నింగ్, ఎమర్జెన్సీ అటానమస్ బ్రేకింగ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
- టాటా పంచ్
సురక్షితమైన కార్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది టాటా పంచ్. క్రాష్ టెస్ట్లో ఈ కారుకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ లభించింది.
- మహీంద్ర XUV 300
మహీంద్రా ఎక్స్ యూవీ 300 కాస్త చిన్నగా ఉంటుంది. ఎక్స్యూవీ 700 కారుకు వచ్చిన సేఫ్టీ రేటింగ్ ఎక్స్ యూవీ 300 కారుకు రావడం ఆశర్యకరమైన విషయం. క్రాష్ టెస్ట్లో ఈ కారుకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ లభించింది.
- టాటా ఆల్ట్రోజ్
టాటా మోటర్స్‌కు చెందిన మరో కారు టాటా ఆల్ట్రోజ్. క్రాష్ టెస్ట్లో అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది.
- టాటా నిక్సన్
టాటా ఆల్టోజ్ కారుకు క్రాష్ టెస్ట్లో వచ్చిన రేటింగే టాటా నెక్సానక్కు కూడా వచ్చింది. అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 5 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది
- మహీంద్రా థార్
మహీంద్రా థార్ క్రాష్ టెస్ట్లో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఫోర్ వీలర్కు క్రాష్ టెస్ట్లో అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు, పిల్లల భద్రతకు మాత్రం 4 స్టార్ రేటింగ్ లభించింది.
- హోండా సిటీ
హోండా సిటీ నాలుగో జనరేషన్ సెడాన్ కారుకు క్రాష్ టెస్ట్లో మహీంద్రా థార్కు వచ్చిన రిజల్టే వచ్చింది. అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు, పిల్లల భద్రతకు మాత్రం 4 స్టార్ రేటింగ్ లభించింది.
- టాటా టైగర్ ఎవ్
టాటా టిగార్ ఈవీ Global NCAP క్రాష్ టెస్ట్ నిర్వహించిన తొలి ఎలక్ట్రిక్ కార్ కావడం విశేషం. టాటా టిగార్ ఎలక్ట్రిక్ వెహికిల్కు క్రాష్ టెస్ట్ అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు, పిల్లల భద్రతకు మాత్రం 4 స్టార్ రేటింగ్ లభించింది.
- టొయోట అర్బన్ క్రూయిసర్
టొయోట అర్బన్ క్రూయిసర్ కార్ 10వ స్థానంలో ఉంది. కారుకు Global NCAP క్రాష్ టెస్ట్లో అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 4 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది.
- టాటా టైగర్/టియాగో
టాటా టిగార్, టాటా టియాగో కార్లు 10వ స్థానంలో స్థానం దక్కించుకుంది. క్రాష్ టెస్ట్లో ఈ కార్లకు అడల్ట్ ప్యాసింజర్స్ భద్రతకు 4 స్టార్ రేటింగ్ వస్తే, పిల్లల భద్రతకు మాత్రం 3 స్టార్ రేటింగ్ లభించింది.