చాలామంది అన్నం వల్ల బలం చేకూరుతుందని మూడు పూటలా అదే తింటారు. కానీ అలా తినడం లాభాల కంటే నష్టాలే ఎక్కువగా చేకూరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రతీపూట అన్నమే తినటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. అంతేకాకుండా దీనివల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అన్నం తినడం వల్ల కేవలం కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కానీ మూడు పూటలా అన్నమే తినడం ఎన్నో ప్రాణాపాయ సమస్యలు తలెత్తుతాయి.
కొంతమంది అన్నం తిన్న వెంటనే నిద్రిస్తారు. కానీ అలా చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉడికించిన బియ్యం లో కేలరీలు అధికంగా ఉంటాయి. దీని ఫలితంగా డయాబెటిస్ సమస్య వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. అన్నం అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహ సమస్యకు దారి తీస్తుంది. అందుకే వీలయినంత తక్కువ తినడమే మంచిది.
తెల్ల బియ్యం లో పీచు పదార్థం అధికంగా ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తడంతో పాటు..నీరసంగా అవుతాము. అందుకే అన్నం కొద్దీ పరిమాణాలలో తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య వైద్యులు. అంతేకాకుండా అప్పుడప్పుడు అన్నానికి బదులు పండ్లు సైతం తీసుకుంటూ ఉండాలి. తినేటప్పుడు అన్నం కంటే కూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.