ఈ మధ్య చాలామంది బ్రేడ్ తినడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఉదయం లేచినప్పుడు, నైట్ పడుకునే ముందు టీలో బ్రేడ్ ముంచుకుని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అలా తినే వారు ఒక్కసారి ఈ నిజాలను తెలుసుకుంటే మీ జీవితంలో మళ్ళి దాని జోలికి పోరు. ముఖ్యంగా బ్రేడ్ లో ఉండే వైట్ పార్ట్ తింటే చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో మీరు కూడా చూడండి.
బ్రేడ్ లో వైట్ పార్ట్ ని గోధుమపిండితో చేస్తారని అందరికి తెలుసు. గోధుమపిండి ని బాగా శుభ్రం వైట్ పార్ట్ ని తయారుచేస్తారు. దాని కారణంగా అందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ను కోల్పోతుంది. అందుకే దీనిని తినడం వల్ల పెద్ద లాభాలు చేకూరే అవకాశం లేదు. వైట్ బ్రెడ్‌ను తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అందుకే డయాబెటిస్ సమస్య ఉన్నవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
బ్రేడ్ లో వైట్ పార్ట్ తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలకు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే దానికి బదులుగా బ్రౌన్ బ్రెడ్ లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్‌లను తీసుకోవడం వల్ల విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అందుకే ఎప్పుడైనా బ్రేడ్ తినాలనిపిస్తే వీటిని తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.