భానుడు ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు ఎండ తీవ్రత నుండి తట్టుకోవడానికి అన్నానికి బదులుగా అధికంగా చల్లటి నీరు తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కావాలనుకున్న వారు చల్లటి నీళ్లు తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకో మీరు కూడా చూడండి.
చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల రక్తనాళాలు తగ్గడంతో జీర్ణక్రియ సమయంలో పోషకాలను గ్రహించే సహజ ప్రక్రియను నిరోధిస్తుంది. చల్లటి నీటిని తాగడం వల్ల గొంతునొప్పి ,జలుబు కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భోజనం తర్వాత చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవిలో వ్యాయాయం తర్వాత చల్లటి నీటిని తాగకూడదు. దీనివల్ల మరింత వేడి ఉత్పత్తి అయ్యి కడుపునొప్పి లేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. లేదంటే చల్లటి నీళ్ల వల్ల కొవ్వు పెరిగి అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే వీలయినంత వరకు చల్లటి నీళ్లకు దూరంగా ఉండడమే మంచిది.