Flash: ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు పేలుళ్ళు..9 మంది దుర్మరణం

0
90
Kabul

ఆఫ్ఘనిస్తాన్ లో వరుస బాంబులతో దద్దరిల్లింది. మొన్నటికిమొన్న కాబుల్‌తో సహా ఐదు చోట్లు పేలుళ్లు సంభవించడంతో..18మంది ప్రాణాలు కోల్పోగా..మరో 65మందికి తీవ్ర గాయాలు అయినా సంఘటన అందరిని కలచివేసింది. ఈ ఘటన నుండి కోలుకోకముందే ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోయి దుశ్చర్యకు పాల్పడ్డారు.

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో గురువారం రాత్రి బస్సులో బాంబు పేలుళ్లకు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఒడిగట్టారు. రెండు బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి తామే కారణమంటూ ఐఎస్ ఐఎస్ స్వయంగా ఒప్పుకుంది.

షియాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం తెలుస్తోంది. రెండు మినీ బస్సును లక్ష్యంగాా చేసుకొని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పేలుళ్లు జరిపినట్టు తాలిబన్ అధికారులు తెలిపారు. గత వారం రోజుల కిందట కూడా మసీదు, మతపరమయిన పాఠశాలలో బాంబ్ పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.