దారుణం..అనుమానంతో కట్టుకున్న భార్యను చంపిన భర్త..

0
118

ప్రస్తుత కాలంలో భార్య భర్తలకు తమ మీద తమకే నమ్మకం లేకుండా పోతుంది. ఎప్పటికి భార్యను భర్త, భర్తను భార్య అనుమానించడం ఓపని అయిపోయింది. తాజాగా ఇలాంటి అనుమానమే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ దంపతులు పెళ్లి చేసుకొని ఇరవై మూడేళ్ల గడవడంతో పాటు.. వారిరువురికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు.

ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో భర్తకు భార్యపై అనుమానం రావడంతో..శుక్రవారం ఉదయం ఇద్దరి మధ్యన ఘర్షణ చోటుచేసుకుంది. అది కాస్త పెద్దగా మారి భర్త వాటర్‌ హీటర్‌, ఇంట్లో వస్తువులతో తీవ్రంగా కొట్టడంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

అనంతరం మరణించిన భార్యను ఆసుపత్రికి తీసుకొస్తుండగా స్థానికులు ఏం జరిగిందని అడగడంతో ఆత్మహత్య చేసుకుందని కట్టు కథ అల్లాడు. ఆ తర్వాత అతని వాలకం చూసి అనుమానపడిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.