ఫ్రిడ్జ్ లో ఈ పదార్దాలు పెడితే విషం కంటే ప్రమాదమట..

0
104

ప్రస్తుత కాలంలో చాలామంది వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకుంటున్నారు. అంతేకాకుండా ఫుడ్ రెడీ చేసుకుని పాడవకుండా అందులో పెట్టుకుంటారు. కానీ అలా పెట్టడం వల్ల చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిని పెడితే విషం కంటే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

చాలామంది ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోసి వాటిని ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. దీనివల్ల కట్ చేసిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం చూపి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తేనెను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఇది ఇంట్లో భద్రమైన ప్రదేశాలలో పెట్టాలని సూచిస్తున్నారు.

అరటి పండ్లని ఫ్రిడ్జ్ లో పెడితే ఎంజైమ్స్ తగ్గి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. పువ్వులని కూడా ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదు. దానివల్ల ఇతర పదార్దాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. టమోటోలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల త్వరగా పాడైపోవడంతో పాటు రుచి కూడా మారుతుంది. వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. దానివల్లా ఇందులో ఉండే రుచి మరియు సువాసన పోయి కుళ్లిపోతాయి.