నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ఆఫర్..

0
111

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ప్రజలను ఆనందపరుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ప్రకటించి ప్రజలను కొంత ఆదుకున్నాడు. తాజాగా మరో కీలక నిర్ణయంతో నిరుద్యోగులకు చక్కని శుభవార్త చెప్పాడు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు బస్సులపై ఆర్టీసీ డిస్కౌంట్ ను ప్రకటించింది. పేద అభ్యర్థులను కొంత మేరకు చేయూతను అందించాలనే  ఉదేశ్యంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ప్రకటన చేసినట్టు తెలిపారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులపై మూడు నెలలకు 20 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లుగా తెలియజేసింది.

ఈ ఆఫర్ అన్ని బస్ పాస్ కౌంటర్లలో పొందవచ్చునని తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డు తో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు జిరాక్స్ జత చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.