కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మే 6న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతూ రైతుల కోసం మే 6వ తేదీన వరంగల్ వేదికగా ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు.
అనంతరం ఈనెల 7న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సభ నిర్వహించి విద్యార్థులను కలిసేలా టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విద్యార్థులతో చర్చించబోతున్నారని తెలిపారు. కానీ ఈ సభకు ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిరాకరిస్తూ టీపీసీసీ అభ్యర్థులకు షాక్ ఇచ్చింది.
రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రాహుల్ గాంధీ సభకే కాకుండా..ఇకపై ఓయూలో ఎటువంటి బహిరంగ సభలకు అనుమతిలేదని ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. అంతేకాకుండా క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధిస్తూ శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది.