Flash: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ కలకలం..

0
129

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయవాడ భారతీనగర్‌లో దుస్తుల పేరుతో కొరియర్‌ సంస్థ నుంచి వెళ్లిన ఓ పార్శిల్‌లో నిషేధిత డ్రగ్స్‌ బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.

తన ఆధార్‌ కార్డు నంబరుతో కొరియర్‌ను ఆస్ట్రేలియాకు బుక్‌ చేశాడు. కానీ తప్పు వివరాలు ఉండడంతో మళ్ళి అది వెనక్కి వచ్చే క్రమంలో పార్శిల్‌ను అధికారులు పట్టుకున్నారు. దాంట్లో 4.49 కిలోల ఎఫిడ్రిన్‌ అనే మత్తు పదార్థం ఉండడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎవరికి పంపాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.