ఫ్లాష్: కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి బాలీవుడ్ నటికి గాయాలు..

0
124

హిందీలో ఎక్కువగా సినిమాలు చేసి మనందరినీ ఆకట్టుకున్న తనుశ్రీ ఓ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యి అభిమానులను షాక్ గురిచేసింది. ఆషిక్ బనాయా ఆప్నే, భాగం భాగ్, ధోల్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆలయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురికావడంతో స్వల్పంగా గాయాలయ్యాయి.

కానీ గాయపడిన కూడా అలాగే ఆలయానికి వెళ్ళి దేవుని దర్శనం తీసుకున్నారు. జీవితంలో తాను మొదటిసారి ప్రమాదానికి గురయినట్టు తెలిపారు. అంతేకాకుండా దెబ్బలు తాకిన కాలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కాలుకు కుట్లు కూడా పడినట్టు తెలిపారు. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు.