బ్రేకింగ్: తెలంగాణ రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్..

0
76

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొనడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇటీవల టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ  ఖాళీ అయిన స్థానాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఈసీ షెడ్యూల్ జారీ చేసింది. మే 12న నోటిఫికేషన్ విడుదలకానుంది. మే 19న నామినేషన్లకు చివరి తేదీగా వెల్లడించింది. మే 30న పోలింగ్‌, ఆ తరువాత ఓట్ల లెక్కింపు జరుగనుంది.