ఇంట్లో ఎలుకల గోల ఎక్కువయిందా? అయితే ఇలా చేస్తే మళ్ళి మీ ఇంటి దరిదాపులకు రావు..

0
87

సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఎలుకలు ఉంటాయి. అవి ఇంట్లో తిరుగుతుంటే చాలా చిరాకుగా ఉండడంతో పాటు అవి మన వస్తువులను పాడుచేస్తాయేమోనని బయపడుతుంటాం. అంతేకాకుండా వాటివల్ల అంటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి మనకు అవసరమైన డాకుమెంట్స్, బట్టలు కొరికేస్తే చాలా నష్టం చేకూరే అవకాశం ఉంది. అందుకే వీటిని చంపడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి..

ఎలుకలు తరచు వచ్చే ప్రేదేశంలో కాస్త బంగాళదుంప పొడిని చల్లండి. దానిని తినడం వల్ల ఎలుకలు వెంటనే చనిపోయే అవకాశం ఉంది. ఉల్లిపాయ వాసన అంటే ఎలుకలకు అస్సలు నచ్చదు. కావున  ఎలకలు తిరుగుతున్న ప్రతి చోట చిన్న ఉల్లిపాయలను పెట్టడం వల్ల ఎలుకలు మల్లి మీ ఇంటికి రాకుండా ఉంటాయి.

అంతేకాకుండా పిప్పర్మెంట్ ఆయిల్ వాసన ఎలుకలకు పడదు.కాబట్టి కాటన్ ను ఉండలుగా చేసుకొని నూనెలో ముంచి అవి ఉండే ప్రదేశాలలో పెట్టాలి. దానివల్ల ఎలుకలు ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటి దరిదాపుల్లోకి రావు. అంతేకాకుండా లవంగాల వాసన కూడా ఎలుకలు భరించలేవు. కాబట్టి కొన్ని  లవంగాలను ఒక క్లాత్ లో తీసుకొని ఎలకలు ఉండేచోట పెట్టడం ద్వారా ఎలుకలు ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి.