ప్రస్తుతం కరోనా మహమ్మారి, అయిడ్స్, కలరా వంటి అంటూ వ్యాధులు భారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మరణాల వల్ల వారి కుటుంబాలలో తీరని విషాదాలు నెలకొనడంతో పాటు..ఒకవేళ ఇంటి పెద్ద మరణిస్తే కుటుంబం మొత్తం రోడ్డు మీద పడవలసి వస్తుంది. కాబట్టి ముందే ఇలాంటి ఈ అంటువ్యాధుల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మొదటగా మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాంతో పాటు మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంకా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈగలు, దోమలు లేకుండా జాగ్రత్త పడాలి. వాటిని మార్కెట్లో దొరికే మందులతో లేదా ఇంట్లో పాటించే సింపుల్ చిట్కాలతో తొలగించడానికి ప్రయత్నించండి.
ఒకవేళ గనుక మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఈగలు ఉన్నాయంటే అర్ధం ఆ ప్రాంతంలో త్వరలో అనారోగ్య సమస్యలు వస్తాయని సంకేతం. ఈగలు విడుదల చేసే లాలాజలంలో అనేక క్రిమికీటకాలు ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఈగలు, దోమలు లేకుండా జాగ్రత్త పాడడం మంచిది.