రోజు ఉదయాన్నే ఇలా నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

0
102

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. మన ఆరోగ్యం బాగుండడం కోసం మనకు ఇష్టంలేని పదార్దాలు కూడా మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే వాటితో పాటు రోజు ఉదయాన్నే ఇలా నడవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ అదెలానో తెలుసుకోవాలనుకుంటున్నారా?

చాలామందికి రోజు వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వాకింగ్ చేసే వారు రోజుకు క‌నీసం గంట వాకింగ్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా నడుస్తున్నప్పుడు చేతులను వదులుగా చేసి ముందుకు, వెనుకకు ఆడించాలి.

ఇలా చేయడం వల్ల శ‌రీరం రిలాక్స్ అయ్యి..మంచి ఫలితాలు లభిస్తాయి.  నడక ప్రారంభించడానికి ముందు నీరు తాగడం వల్ల ఎక్కువ సేపు ఆయాసం రాకుండా ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరగడం, చెమ‌ట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని అర్ధం.