ఏపీలో కాల్పులు కలకలం రేపాయి. సురేష్ అనే ప్రేమోన్మాది చేసిన పనికి నిండుప్రాణం బలికావడంతో పాటు..తాను కూడా మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో సురేష్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కానీ అతను కొంతకాలం ఇంటి వద్దనే ఉంటూ అదే గ్రామంలో నివసిస్తున్న కావ్య అనే యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.
కావ్యను పెళ్లి చేసుకోవాలని నిశ్యయించుకొని తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. కానీ పెళ్ళికి కావ్య కుటుంబసభ్యులు నిరాకరించడంతో తీవ్రంగా కక్ష పెంచుకొని చంపాలని పేకట్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
అతను అనుకున్న విధంగానే ఓ తుపాకితో నవ్యను కాల్చడంతో రక్తమడుగులో ఉన్న యువతిని గమనించిన స్థానికులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించింది. అనంతరం తనను తాను కాల్చుకొని సురేష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.