తుఫాన్ ఎఫెక్ట్ విమానాలు రద్దు..

0
93

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండుటెండల్లో తుఫాను ముంచుకొస్తుందని ఐఎండీ హెచ్చరించడంతో ప్రజలు భయబ్రాంతులవుతున్నారు. అసని తుపాను వేగంగా దూసుకొస్తుందని వాతావరణ శాఖ తెలియజేయడంతో అందరు అప్రమత్తం అవుతున్నారు. ఈ తుఫాన్ దాటికి ఏపీలో పలు ప్రాంతాల్లో  ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ముఖ్యంగా ఈ తుఫాన్ దాటికి  విమానాలపై ప్రభావం పడి విశాఖపట్నంలో పలు విమానాలు వెనుదిరగడం జరిగింది.

విశాఖలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంతో పలు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో ఇండిగో సర్వీసులు కూడా రద్దు కావడం జరిగింది. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి విశాఖకు రావల్సిన విమానాలు వెనుదిరిగాయి. రేపటికి అంటే బుధవారం నాడు విశాఖపట్నం- విజయనగరం మధ్య తీరం దాటనుందని తెలుస్తోంది.

ఈ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర ప్రాంతాలపై అధికంగా ఉందనున్నట్టు అధికారులు వెల్లడించారు.అయితే ఈ తుఫాన్ దాటి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసారు. ముఖ్యంగా అసని తుపాను ప్రభావం విశాఖపట్నం, ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తూ..భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉండే ఇళ్ళు కోతకు గురికావంతో ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.