నిరుద్యోగులకు శుభవార్త – తెలంగాణ లో మరో నోటిఫికేషన్ విడుదల

0
105

తెలంగాణాలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. తాజాగా హైదరాబాద్ రీజియన్‌లోని సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కరెంట్, పవర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి 1271 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో భర్తీ చేయనుంది.

మొత్తం పోస్ట్‌లు: 1271

జూనియర్‌ లైన్‌మెన్‌: 1000

సబ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌): 201

అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌): 70

దరఖాస్తు తేది: 11/05/2022