నిమ్మకాయ పొట్టును పడేస్తున్నారా? అయితే ఈ నిజాలు తెలుసుకోండి..

0
90

నిమ్మకాయ రసం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. నిమ్మ‌ర‌సంలో ఉండే విట‌మిన్ సి మ‌న చ‌ర్మాన్ని రక్షించడంతో పాటు రోదనిరోధక శక్తిని కూడా మెరుగు పరుస్తుంది. సాధారణంగా వేసవిలో శరీరం వేడి చేయకుండా చల్లగా ఉండేందుకు నిమ్మకాయ షర్బత్ ని తరువాత  చాలామందికి తెలియక నిమ్మకాయ తొక్క‌ల‌ను పడేస్తుంటారు.

కానీ వాటిని ఈ విధంగా చేసుకొని తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు. సాధారణంగా వాటిని నేరుగా తింటే చేదు ఉండడం వల్ల ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అయితే వాటిని ఎండ బెట్టి పొడి చేసి ఉపయోగించుకుంటే మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే పొడిని జ్యూస్‌లా చేసుకొని కూడా తాగొచ్చు.

నిమ్మకాయ తొక్క‌ల్లో  విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, డి-లైమోనీన్‌, బీటా కెరోటిన్, సిట్రిక్ యాసిడ్‌, మాలిక్ యాసిడ్‌, హెస్పెరిడిన్ అనే పోష‌కాలు అధికంగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోవడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. గుండె జ‌బ్బులు రాకుండా చేయడంతో పాటు తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య పెంచడంలో కూడా దోహదపడుతుంది.