మనలో చాలామందికి పాదాల పగుళ్ల సమస్య ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్న కానీ ఈ సమస్య తప్పకుండా వస్తుంది. ఈ పగుళ్ల కారణంగా కాళ్ళు అందవిహీనంగా కనబడడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవడానికి డబ్బులు వృధాగా ఖర్చుపెట్టి వివిధ రకాల ఆయింట్ మెంట్స్ వాడుతుంటాము. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సింపుల్ చిట్కాలతో దూరం చేసుకోండిలా..
పాదాల పగుళ్లు ఉన్నవారు పాదాలకు కాస్త నూనె, ఆముదం లేదా నెయ్యిని రాసి వేడి నీటిలో 25 నిమిషాల పాటు ఉంచిన తరువాత వస్త్రాన్ని ఉపయోగించి పాదాలను శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల కనీసం వారం రోజులలో ఈ సమస్య నుండి బయటపడొచ్చు. అంతేకాకుండా వీలయినంత వరకు చెప్పులను ధరించి ఉండడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడకుండా ఉంటాము.
ఈ సమస్యను తొలగించడంలో వేప ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి. కొన్ని వేప ఆకులను తీసుకొని అందులో కాస్తంత పసుపు వేసి మెత్తని పేస్ట్ ల తయారు చేసుకోవాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ను పాదాలు పగిలిన ప్రాంతాల్లో రాసి ఆరిన తర్వాత పొడిగా తుడిచి నూనెతో మర్దన చేయాలి. దీనివల్ల పాదాలు పగుళ్లు రాకుండా, అందంగా మారుతాయి. వాటితో పాటు గోరింటాకును కూడా పాదాలకు పెట్టుకోవడం వల్ల సమస్య తొలగిపోతుంది.