మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా గోవాలో ఘోర దారుణం చోటు చేసుకుంది.
రష్యాకు చెందిన ఒక మహిళ తన కుతూరితో కలసి సరదాగా గడపటానికి గోవాకు వెళ్లింది. అయితే అక్కడ ఓ కామాంధుడు చేసిన పనికి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై రూమ్ అటెండెంట్ గా పనిచేస్తున్న రవి అత్యాచారం చేసినట్టు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండుసార్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తల్లి ఆరోపించింది.
మొదట స్విమ్మింగ్ పూల్ లో, ఆ తర్వాత హోటల్ గదిలో గత వారం రోజుల కింద అత్యాచారానికి పాల్పడి ఘటన స్థలం నుండి పరారయినట్టు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు కర్ణాటకు కు చెందని వాడిగా పోలీసుల విచారణలో తెలిపింది.