Breaking: విషాదం..మధ్యప్రదేశ్ లో దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి..

0
112
Kabul

మధ్యప్రదేశ్ లోని​ గుణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఎస్​ఐ రాజ్​కుమార్​ జాధవ్​, ఇద్దరు కానిస్టేబుళ్లు నీలేశ్​ భార్గవ, శాంతారామ్​ మృతిచెందినట్టు స్వయంగా రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా వెల్లడించారు.