ఇక సినిమాలు చేయను..ప్రముఖ హీరో సంచలన నిర్ణయం

0
102

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, తమిళ నాడు స్టార్‌ హీరో ఉదయ నిధి స్టాలిన్‌ ఇటీవలే  ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవి కారణంగా సినీప్రస్థానానికి బ్రేక్ ఇవ్వబోతున్నాడా అని ప్రేక్షకులు అనుకున్న క్రమంలో అభిమానులను ఖుషి చేస్తూ సినిమాలను అలాగే కొనసాగించాడు.

అయితే తాజాగా ఉదయ నిధి స్టాలిన్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకొని అందరిని షాక్ కు గురిచేశాడు. ఇక నుంచి తాను సినిమాలు చేయబోనని ఉదయ నిధి స్టాలిన్‌ స్వయంగా ప్రకటించడం వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయ నిధి నటిస్తున్న ‘మామన్నన్‌’ చిత్రమే చివరి సినిమా అని తాజా ఇంటర్వ్యూలో ప్రకటించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాకు మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తుండగా..ఫాహద్‌ ఫజల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో పోషించనున్నారు. సూపర్‌ హిట్ బాలీవుడ్‌ సినిమా ఆర్టికల్‌ 15 కు తమిళ రీమేక్‌ అయిన నెంజుకు నీధి అనే సినిమాలో నటించాడు ఈ యంగ్ హీరో. ఈ నిర్ణయానికి ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్‌ చేయలేకపోవడం కారణమని సమాచారం తెలుస్తుంది.