చీమలను నిమిషాల్లో తరిమికొట్టే సింపుల్ చిట్కాలివే?

0
103

సాధారణంగా అందరి ఇళ్లల్లో చీమలు ఉండడం వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. చీమలను నివారించడానికి మహిళలు మార్కెట్లో దొరికే వివిధ రకాల ఫెస్టిసైడ్స్ వాడడం వల్ల మన ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సింపుల్ చిట్కాలను పాటించి ఇంట్లో ఉన్న చీమలను తరిమికొట్టండిలా..

చీమలు మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉండాలంటే చీమలు వచ్చే చోట తినే సోడాను చల్లడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. దాల్చిన చెక్క వాసనా చీమలకు పడదు. కావున కాబట్టి దాల్చిన చెక్క పొడిని చీమలు వచ్చే ప్రదేశాల దగ్గర పెడితే ఇక అవి వేరే దారి చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

చీమల్ని తరిమేసేందుకు వవెనిగర్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి నీటిని చీమల పుట్టలు, కాలనీలపై చల్లడం వల్ల చీమలు పోవడంతో పాటు వివిధ రకాల పురుగులు ఉన్న ప్రదేశాల్లో కూడా వెనిగర్ స్ప్రే చేయడం వల్ల అవి మరణిస్తాయి. ఇవన్నీ పాటించిన చీమలు పోకపోతే చివరకు బొరాక్స్ కూడా వాడొచ్చు.