చద్దన్నం వేడి చేసి తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
104

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరికి తెలిసిందే. కావున ప్రతి ఒక్కరు అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అన్నం తినే క్రమంలో కొంచెం కూడా కిందపలేకుండా జాగ్రత్త పడతారు. ప్రస్తుతరోజుల్లో అన్నం లేకుండా అలమటిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే పడెయ్యకూడదనే ఉద్దేశ్యంతో చాలామంది రాత్రి వండిన అన్నం మిగిలితే దాన్నే ఉదయాన వేడి చేసుకొని తింటుంటారు. అలా తినడం వల్ల ఏం జరుగుతుందో మీరే చూడండి..

ప్రతీ ఆహార పదార్థంలో టాక్సిన్లు ఉండడంతో పాటు మనశరీరంలో కూడా టాక్సిన్లు ఉంటాయి.  విషపూరితమైన ఈ టాక్సిన్లు కొన్నిసార్లు స్పందిస్తే విషపూరితమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.  చాలా రకాల ఆహార పదార్థాలు, వంటకాలు ఒకరోజు గడిచిన తర్వాత బ్యాక్టీరియాలకు నివాసాలుగా మారి టాక్సిన్లు విడుదల కావడం వల్ల పలు రకాల ఆరోగ్య  సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా అన్నాన్ని వేడి చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్ల వల్ల వాంతులు, డయేరియా వంటి సమస్యలకు గురవుతాము. అందుకే అన్నం వండేటప్పుడు బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉండడనివ్వడంతో పాటు వీలైనంత వరకు అందరికీ సరిపోయేంత అన్నం మాత్రమే వండుకోవడం మంచిది. అందుకే అన్నాన్ని వేడి చేసే క్రమంలో సరైన పద్ధతులు ఉపయోగించడం మంచిది.