Flash: దారుణం..తల్లిని చంపి మృతదేహాన్ని డ్రమ్ లో పెట్టిన కసాయి కొడుకు ..

0
90

చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి కొడుకు చేసిన పనికి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ప్రజలు షాక్ అవుతున్నారు. కన్నతల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పిపెట్టిన హృదయవిదారక ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం దంపతులకు ముగ్గురు కూమారులు ఉన్నారు.

ముగ్గురు కుమారులలో చిన్నకుమారుడు అయినా సురేష్‌ తో కలసి ఉంటున్న తల్లిని చంపి డ్రమ్ లో పెట్టాడు. అనంతరం తల్లిని చూడడానికి వచ్చిన పెద్దకుమారుడు తల్లి కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు చిన్న కుమారుడుని విచారించగా డ్రమ్‌లో తల్లి మృతదేహం ఉన్నట్టు సురేష్‌ చెప్పడంతో పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. ఈ ఘటనకు చిన్నకుమారుడి మానసిక స్థితి బాగాలేకపోవడమేనని స్థానికులు చెబుతున్నారు.