దేశంలో మోసాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. మోసగాళ్ల మాయలో పడి ఇప్పటికే లక్షల్లో నష్టపోయిన సామాన్య ప్రజలు అధికంగా ఉన్నారు. తాజాగా మరో కొత్త రకం మోసంతో చిరు పులవ్యాపారుల పొట్ట కొట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు వసూలు రాయళ్ళు. జిహెచ్ఎంసి పేరుతో అఫ్జల్ గంజి పరిధిలో వ్యాపారులను అన్యాయంగా మోసం చేస్తున్నారు.
జాంబాగ్ పుల పర్కెట్ లో వసూలు దందా విచ్చలవిడిగా జరుగుతుంది. చిరు పుల వ్యాపారుల నుండి బల్దియా సిబ్బంది ఎలాంటి రసీదు లేకుండా డబ్బులు పెద్ద మొత్తంలో వసులు చేస్తూ పొట్టకూటికి లేకుండా చేస్తున్నారు. దందారాయళ్ళు వారంలో మూడు రోజులు వసూలు చేయడంతో పాటు..300 దుకాణాల్లో 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంది. దాంతో వ్యాపారాలు వాటిని భరించలేక తమను ఆదుకోవాలంటూ ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు.