వంటల్లో ఉల్లిపాయ‌ల‌ను ఎక్కువగా వాడుతున్నారా? అయితే మీ ప్రాణానికే ప్రమాదమట..

0
104

సాధారణంగా వంటల్లో అందరు ఉల్లిపాయలు వెయ్యడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఎందుకంటే ఉల్లిపాయలను వంటల్లో వేయడం వల్ల రుచి, సువాసన బాగుంటుందనే ఉద్దేశ్యంతో వేస్తారు. కానీ రుచి, సువాసన కోసం ఉల్లిపాయలను అధికంగా వేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఉల్లిపాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉండడం వల్ల ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వంటల్లో ఉల్లిపాయలను మితంగా వేయడం వల్ల ఎన్ని లాభాలు చేకూరుతాయో అధికంగా వేయడం వల్ల అన్నే నష్టాలు చేకూరుతాయి. ఉల్లిపాయలలో ఫ్ర‌క్టేన్ అనే పోష‌క ప‌దార్థం ఉండడం వల్ల ఇది అధికంగా జీర్ణాశయంలో చేరితే  గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అందుకే రోజుకు కనీసం 50 నుంచి 80 గ్రాముల ఉల్లిపాయ‌ల‌ను మాత్రమే వాడడం మంచిది. అంటే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ లేదా మీడియం సైజ్ ఉల్లిపాయ‌ను తినడం మంచిదన్నమాట. దీనిని మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా..వ్యాధులు మన దరికి చేరకుండా కాపాడుతుంది. సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా కాపాడడంలో కూడా సహాయపడుతుంది. అలాగే షుగ‌ర్, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లను సైతం తగ్గిస్తుంది.