‘కేజీఎఫ్‌-2’ నుంచి అదిరిపోయే అప్డేట్..సుల్తానా వీడియో సాంగ్‌ రిలీజ్

0
102

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కెజిఎఫ్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ ల సునామి సృష్టించింది. ఈ నెల 14న విడుదలైన కెజిఎఫ్-2 మూవీ రిలీజ్ అయ్యి  పాన్ ఇండియా స్థాయిలో  మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా చూడడానికి జనాలు ఎగపడుతున్నారు.

మొదటి భాగానికి మించిన వసూళ్లను చిత్రబృందం తమ ఖాతాల్లో వేసుకుంటుంది. హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రభంజనం సృష్టించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాకి మూడవ భాగం కూడా ఉండాలని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం  ఉందని చెబుతుండటం అందరిలోనూ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ‘కేజీఎఫ్’ చిత్ర బృందం గ‌త రెండు వారాల నుంచి ప్ర‌తి వారం ఒక వీడియో సాంగ్‌ను విడుద‌ల చేస్తూ ఉండగా..తాజాగా కేజీఎఫ్-2 నుంచి ‘సుల్తానా’ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుదల చేసారు. ఇదివ‌ర‌కే చిత్రం నుంచి విడుద‌లైన మూడు పాట‌ల‌కు ప్రేక్ష‌కుల ఎంతో ఆకట్టుకున్నాయి.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/PWaPCqeCfeY