ప్రజలు ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు, వంటగ్యాస్ ధరలు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో స్టీల్, ఐరన్ ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపి అదిరిపోయే శుభవార్త చెప్పింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా స్టీల్, ఐరన్ ధరలు పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడి నానాతిప్పలు పడ్డారు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి వాహదారులను కొంత భారాన్ని తగ్గించారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్టీల్ ధరలు మరో 10-15 శాతం తగ్గే అవకాశం ఉందని ఇంజినీరింగ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపాడు. ప్రస్తుతం టన్ను స్టీల్ ధర రూ 82,000గా కొనసాగుతుంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.