కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత..ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి

0
121
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొనసీమ జిల్లాకు అంబేద్కర్‌ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ యువకులు నిరసనలు చేసారు.  కలెక్టర్‌ కార్యాలయంలోకి ఆందోనళనకారులు దూసుకొస్తుండగా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా..వారి నుండి తప్పించుకొని ఏకంగా వారిపై కూడా తిరగబడడం జరిగింది.
ఈ ఘటనలో ఆందోళనకారులు పోలీసులను రాళ్లతో దాడి చేయగా..జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై కూడా రాళ్ల దాడి చేసారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి గాయపడడంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోలీసులు  తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేసారు.