అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరెక్కిస్తున్నాడు.
ఎఫ్2 మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తమదైన శైలిలో నటించి భారీ విజయాన్ని సాధించారు. దాంతో ఎఫ్ 3 కూడా తీయాలని నిర్ణయించినుకొని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేయనున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని అంశాలను అనిల్ రావిపూడి విలేకర్లతో ముచ్చటించారు.
అయితే ఎఫ్3 సినిమాలో ముగ్గురు హీరోలు ఉండబోతున్నారని ప్రేక్షకులు అనుకున్న క్రమంలో దానిపై స్పష్టత ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పుడే ముగ్గురు హీరోలతో సినిమా చేస్తే తర్వాత ఏమీ ఉండదని చిత్రబృందం ఆలోచించి ఎఫ్2 లో ఉన్న కారక్టర్లతో సినిమాను రూపొందించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తామన్నాడు. కానీ భవిష్యత్తులో రాబోయే ఎఫ్4 మాత్రం మూడో హీరోను తప్పకుండా దించుతామని చెప్పి ప్రేక్షకులను ఖుషి చేసాడు.