ఏపీలో ఒకే రోజు మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటన అందరిని భయభ్రాంతులను చేసింది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..మొదటగా అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలోని అప్పన్నదొరపాలెం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. కారు బోల్తా పడి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
ఆ తరువాత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మం.ఒడిమెట్ట వద్ద ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన మినీ వ్యాను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంకా అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆగిఉన్న వ్యాన్‌ను బైక్ ఢీకొట్టి ఒకరు మృతిచెందారు. ఈ ఘటనల కారణంగా ఏపీలో రహదారుల్లో రక్తం ఏరులైపారుతున్నది. దాంతో ప్రజలు రహదారులపై నడవాలంటేనే జంకావలసిన పరిస్థితి ఎర్పడింది.