హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..

0
103
Kabul

హైదరాబాద్ మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్  కారణంగా రాయదుర్గం గ్రీన్ బావర్చి హోటల్ లోని థర్డ్ ఫ్లోర్ లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ ఘటన సంభవించిన సమయంలో థర్డ్ ఫ్లోర్ లో 20 మంది దాకా ఉండగా అభ్యర్థులు ఉండగా..అభ్యర్థులు కిందికి రావడానికి తీవ్రగా ప్రయత్నిస్తూ గాయాల పాలవుతున్నారు.

దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఫైర్ సిబందిని రంగంలోకి దింపి మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రత్నిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్రంగా శ్రమించి ముగ్గురిని వెలికితీసి సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అగ్ని ప్రమాదం వల్ల దట్టంగా పొగ అలుముకోవడంతో పరిసరప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.