వాల్మీకి సెన్సార్ టాక్..!!

వాల్మీకి సెన్సార్ టాక్..!!

0
83

వరుణ్ తేజ్ కీలకపాత్రలో అధర్వ, పూజ హెగ్డే, మృణాళిని రవి నటిస్తున్న సినిమా వాల్మీకి.. హరీష్ శంకర్ దర్శకుడు.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ కాగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట సినిమా నిర్మితమైంది.. మొత్తం 168 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గణేష్ అనే ఒక సాధారణ వ్యక్తి, పరిస్థితుల ప్రభావం వలన గద్దలకొండ గణేష్ అనే ఒక పక్కా గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమాలోని మూల కథాంశమట.. వెల్లువొచ్చి గోదారమ్మ, జర్ర జర్ర సాంగ్స్ సినిమాకు పెద్ద హైలైట్ అని, అంటున్నారు.. సినిమాలోని విజువల్స్ ని ఎంతో గ్రాండియర్ గా చూపించిన ఫోటోగ్రాఫర్ ఆయనంక బోస్ పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు.మొత్తానికి హరీష్ శంకర్ చాల రోజుల తర్వాత ఓ హిట్ కొట్టబోతున్నాడని మాత్రం తెలుస్తుంది..