కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇంట్లో చోరీ..ఎన్ని లక్షలు మాయమయ్యాయంటే?

0
78

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇతని ఇంట్లో కొంతమంది గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడడంతో పరిసరప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన కారణంగా కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళనపడుతూ పోలీసులను ఆశ్రయించారు. కేవీపీ సతీమణి సునీత ఇంట్లో ఏకంగా రూ.46లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే..ఈ నెల 11న డైమండ్‌ నెక్లెస్‌ ధరించి సునీత ఓ ఫంక్షన్‌కు వెళ్లగా..కాసేపటి తరువాత ఇంటికి వచ్చి చూసుకుంటే నెక్లెస్‌ లేకపోవడంతో  రెండు రోజుల కిందట బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. ఈ ఘటనపై సునీత ఇంట్లో పని మనుషులపై అనుమానం ఉన్నట్టు పోలీసులకు సమాచారం తెలియజేసింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.