Flash: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు ఇకలేరు

0
82

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలతో కనీసం కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా, వ్యక్తిగత కారణాల చేత మరణించగా..తాజాగా ప్రముఖ సింగర్‌ కేకే పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ అకస్మాత్తుగా మరణించి అందరిని ఆశ్యర్యానికి గురిచేసారు. ఈయన మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బుధవారం రాత్రి కృష్ణకుమార్‌ కున్నత్‌ కోల్‌కతాలో అద్భుతంగా సంగీత ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అబ్బురపరిచారు. సంగీత ప్రదర్శన అనంతరం హోటల్‌కు చేరుకున్న కేకే అక్కడిక్కడే కుప్పకూలి మరణించినట్టు సమాచారం తెలుస్తుంది. ఇది గమనించిన స్థానికులు కేకేను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మరణ వార్త విన్న సినీ ప్రముఖుల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.