టీటీడీ సంచలన నిర్ణయం..ఇప్పటి నుండి భక్తులకు ప్రసాదం పరిమితమే

0
131

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు షాక్ ఇస్తూ తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం చేస్తునట్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

అయితే భక్తులు ఈ నిర్ణయం నుండి ఇంకా కోలుకోకముందే తాజాగా మరో నిర్ణయంతో భక్తులకు టీటీడీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు భక్తులు ఎన్ని లడ్డూలు అయినా కొనుక్కునే వీలుండగా ప్రస్తుతం దీనికి కూడా పరిమితులు విధించినట్టు టీటీడీ ప్రకటించింది. తాజా నిర్ణయంతో ఇప్పుడు రెండు మాత్రమే ఇస్తుండడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు లడ్డూలు మాత్రమే విక్రయించడానికి తక్కువ లడ్డులు ఉండడం కారణమని టీటీడీ తెలిపింది.