నోట్లోంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

0
116

ప్రస్తుతకాలంలో నోట్లోంచి దుర్వాసన రావడం ప్రతిఒక్కరికి పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి గంటల తరబడి పళ్ళు తోముతుంటారు. కానీ ఆశించిన మేరకు ఫలితాలు మాత్రం లభించవు. ఈ సమస్యకు గల ముఖ్య కారణాలు ఏంటంటే..తీసుకున్న ఆహారం వల్ల కానీ, లేక లోపల ఏదైనా సమస్య ఉన్నా ఇలాంటి దుర్వాసన వస్తుంది.

అంతేకాకుండా మంచినీళ్లు తక్కువ తాగేవారికి కూడా స్మెల్స్ ఎక్కువగా వస్తుందని నిపుణులు చేబుతున్నారు. అందుకే ఉదయం పూట నీరు బాగా  తాగడం వల్ల ఈ సమస్య నుండి కాస్త బయటపడే అవకాశం ఉంటుంది. బోజనం చేసిన వెంటనే పుక్కిలించకపోవడం వల్ల కూడా ఈ సమస్య వేధిస్తుంది. కావున బోజనం చేసిన వెంటనే పుక్కిలించటం మాత్రం అలవాటుగా చేసుకోవడం మంచిది.

ఇంకా పేస్ట్ బ్రషింగ్ కంటే కూడా ఒరిజనల్ క్వాలిటీ తేనె తీసుకుని బ్రష్ లో ముంచి దాంతో బ్రష్ చేయొచ్చు. ఇలా తరచు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా రోజు బ్రష్ వేసుకునే ముందు  ఒక పది నిమిషాలు వేపపుల్లను బాగా నమలడం వల్ల ఆ చేదుకు క్రిములు చనిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం నోటి దుర్వాసనకు చెక్ పెట్టేయండి ఇలా..!