తిరుమల కిటకిట..శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

0
90

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో  భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు.

ఇంకా క్రమక్రమంగా భక్తుల రద్దీ అధికంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న శ్రీవారిని 66,001 మంది భక్తులు దర్శించుకోగా 38,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు వచ్చిందని వెల్లడించారు. ఇటీవలే తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, ప్రసాదం కూడా పరిమితంగానే పెడుతున్న విషయం తెలిసిందే.