అనకాపల్లిజిల్లా అచ్చుతాపురం SEZ లో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వాయువుల కారణంగా 100మందికి పైగా అస్వస్థతకు గురయ్యి సృహ తప్పి కోల్పోవడంతో స్థానికులు వారిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళ కార్మికులపై ప్రభావం పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు కెమికల్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకవ్వడమే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.